Mark Shankar : కోలుకుంటున్న మార్క్ శంకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మార్క్ శంకర్ ఉన్న స్కూల్లో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో వెంటనే అక్కడి కార్మికులు స్పందించి గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఇక అరకు పర్యటనలో ఉన్న సమయంలో పవన్ సతీమణి అన్నా ఫోన్ లో ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
సింగపూర్ కు సమ్మర్ క్యాంపు కోసం వెళ్లిన మార్క్ శంకర్, అక్కడి పాఠశాలలో మంగళవారం అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో తొలుత కాస్త ఇబ్బంది పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే మంగళవారం రాత్రి పవన్ కల్యాణ్, చిరంజీవి, సురేఖ సింగపూర్ వెళ్లారు. శంకర్ త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు అనేక ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com