Nara Lokesh : శాన్ ఫ్రాన్సిస్కోలో లోకేశ్.. టీడీపీ శ్రేణుల్లో జోష్

Nara Lokesh  : శాన్ ఫ్రాన్సిస్కోలో లోకేశ్.. టీడీపీ శ్రేణుల్లో జోష్
X

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29న లాస్ వేగాస్‌లో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 2000 ఏడాదిలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన చంద్రబాబు బాటలో లోకేశ్ నడుస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags

Next Story