Whatsapp New Feature : వాట్సప్‌లో కొత్త ఫీచర్.. స్క్రీన్ షేర్ చేసేయండి

మెటా ప్లాట్ ఫాం వాట్సప్ ( Whatsapp ) కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తఫీచర్ దాదాపు వీడియో కాన్ఫరెన్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఏకకాలంలో 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవడం, అలాగే ఆడియో సహా స్క్రీన్ షేర్ చేసుకునేలా సౌలభ్యం కొత్త ఫీచర్ ప్రత్యేకత.
ముప్ఫై మందికిపైగా ఉండే పెద్దగ్రూప్ మధ్య వీడియో కాల్ ను ఈజీ చేసింది ఈ ఫీచర్. డైలాగ్ ను మెరుగు పరచడాన్ని మెటా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే, వినియోగ దారులు తమ స్క్రీన్ ఆడియోతో షేర్ చేసుకోవచ్చు.
గరిష్టంగా 32 మందికి ఈ స్క్రీన్ షేర్ ను చూడొచ్చు. గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మీటింగ్ లో ఉన్న ఫీచర్స్ ను మెల్లమెల్లగా తీసుకొస్తోంది మెసెంజర్ దిగ్గజం వాట్సప్. మరో వారంలో ఈ అప్ డేట్ అన్ని రకాల ఫోన్లలో అందుబాటులోకి రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com