Meta Apps : మెటా యాప్స్ లో అంతరాయం.. కోట్లల్లో నష్టం

Meta Apps : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొన్న తర్వాత ఒక రోజులోనే దాదాపు 3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్ నికర విలువ ఒక రోజులో 2.79 బిలియన్ డాలర్లు తగ్గి 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ అతను ప్రపంచంలోని నాల్గవ-ధనవంతుడుగా తన స్థానాన్ని కొనసాగించాడు.
గంట సేపు గ్లోబల్ అవుట్‌డేజ్ తర్వాత, మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఇది మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువలో కోతకు దారితీసింది. మెటా షేర్లు వాల్ స్ట్రీట్‌లో ఓవర్‌నైట్ ట్రేడింగ్ సెషన్‌ను ఒక్కొక్కటి 490.22 డాలర్ల వద్ద ముగించాయి. Facebook, Instagram, థ్రెడ్స్ యూజర్స్ మార్చి 5న రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అదనంగా, మెటా క్వెస్ట్ యూజర్స్ తమ హెడ్‌సెట్‌లకు లాగిన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది యూట్యూబ్ యూజర్స్ కూడా లోపాన్ని ఎదుర్కొన్నట్లు గుర్తించారు. అన్ని అప్లికేషన్‌లు సాధారణ కార్యాచరణకు తిరిగి రావడానికి ముందు దాదాపు ఒక గంట పాటు ఈ అంతరాయం కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com