Phonepe : ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించిన PhonePe

Phonepe : ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించిన PhonePe

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే(PhonePe) అనే ఆర్థిక సేవల సంస్థ తన ఇండస్ యాప్‌స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇది యాప్ స్టోర్ స్థలంలో దశాబ్దానికి పైగా అనుభవంతో వచ్చిన 'మేడ్ ఇన్ ఇండియా' యాప్.

ఇండస్‌ యాప్‌స్టోర్‌ను తీసుకొస్తున్నట్లు ఫోన్‌పే ఇదివరకే ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ డెవలపర్ల కోసం గతేడాది అందుబాటులోకి తెచ్చింది. తాజాగా సామాన్య యూజర్లు సైతం దీన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇన్‌-యాప్‌ కొనుగోళ్లపై గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్‌ 1 వరకు యాప్‌ లిస్టింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్‌–యాప్‌ బిల్లింగ్‌ కోసం తమకు నచ్చిన థర్డ్‌పార్టీ పేమెంట్‌ గేట్‌వేను ఎంచుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు.

అనంతరం మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్‌ అవ్వొచ్చు. ఆపై మీకు నచ్చిన యాప్‌ను స్టోర్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ-మెయిల్‌ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యే విధానాన్ని ఈ యాప్‌ స్టోర్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Tags

Read MoreRead Less
Next Story