Liquor Prices Increase: తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు..వివరాలివి

Liquor Prices Increase: తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు..వివరాలివి
X

మద్యం ధరలను పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాలు మందు బాబులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్ ధరలు తప్ప అన్ని బ్రాండ్ల మద్యం బాటిళ్లపై రూ.10లను ఎక్సైజ్ శాఖ పెంచింది. అటు తెలంగాణలో కేవలం బీర్ల ధరలనే పెంచారు. అన్నిరకాల బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 15% ధరలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

తెలంగాణలో ర్ల ధరల పెంపు నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుంది. ప్రస్తుతమున్న ధరలపై 15% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ₹150గా ఉన్న లైట్ బీరు ధర వ్యాట్, ఎక్సైజ్ సుంకం కలుపుకొని ₹180 వరకు, స్ట్రాంగ్ బీరు ధర ₹160 నుంచి ₹200 వరకు పెరిగే ఛాన్సుంది. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉండటం, బేసిక్ ధర పెంచాలని బీర్ల కంపెనీల డిమాండ్, ధరల నిర్ణయ కమిటీ సూచన మేరకు రేట్లు పెంచినట్లు తెలుస్తోంది.

ఏపీలో మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.

Tags

Next Story