Telugu States : రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్‌లో 44, ఏపీలోని నంద్యాల జిల్లా దొర్నిపాడులో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే అత్యధికం. చాలాచోట్ల 40+ డిగ్రీలు రికార్డయ్యాయి. వడదెబ్బతో రోజూ మరణాలు సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లొద్దని, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com