Vijayashanti : లెజ్నెవాపై ట్రోలింగ్ ను ఖండించిన విజయశాంతి

Vijayashanti : లెజ్నెవాపై ట్రోలింగ్ ను ఖండించిన విజయశాంతి
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడాన్ని ట్రోల్ చేయడాన్ని సినీనటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా ఖండించారు. పవన్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయడపడిన విషయం తెలిసిందే. తమ కుమారుడు ప్రమాదం నుంచి బయడపడడంతో అన్నా లెజినోవా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయితే, ఆమె భక్తి శ్రద్దలతో శ్రీవారిని పూచించడంపై ఎక్స్ వేదికగా ట్రోల్ చేయడాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు.

Tags

Next Story