రానున్న 3 గంటల్లో చెన్నైకి భారీ వర్షసూచన..
చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగలపట్టు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం రానున్న 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ స్థాయిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. చెన్నైలో గత ఆదివారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రానిపేట్, చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్‌పేట్, వెల్లూరు జిల్లాలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
గడచిన 2 గంటల్లో వాతావరణంలో ఈ ప్రాంతాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ జిల్లాల్లోని అన్ని ప్రాంతంలోనైనా భారీ ఉరుములు, మెరుపులు సంభవిచ్చవచ్చని తెలిపింది. భారీ వర్షాల కారణంగా. నదులు, చెరువులు, రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడం, చెట్లు విరిగిపడటం వంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం, పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడవచ్చని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com