Whatsapp New Features : ఇది తెలుసా.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్ ‘గ్రూప్ చాట్ ఈవెంట్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూప్‌లలోని సభ్యులు ఈవెంట్స్‌ను క్రియేట్ చేసి ఇతరులను ఆహ్వానించవచ్చు. ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచవచ్చు. దీని వివరాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. తొలుత కమ్యూనిటీ గ్రూప్‌లకోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు సాధారణ గ్రూప్‌లకూ విస్తరించారు. ఇది యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ ఓపెన్ చేయగానే రౌండ్ షేప్‌లో ఉన్న ఒక ఐకాన్ కనిపిస్తోంది. ఆ సింబల్‌పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే కొంత మందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్ మెటా తెలిపింది.
వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలో కూడా Meta AI ఇంగ్లీష్‌లో కూడా ఉంది. దీనిని Meta.ai వెబ్‌సైట్ ద్వారా కూడా ఆక్సెస్ చేయవచ్చు. ఈ చాట్‌బాట్ US, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉగాండా & జింబాబ్వేతో సహా 12 దేశాల్లో ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com