Mobile Phone While Sleeping : జాగ్రత్త.. ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా?

ఎంతగానో మనం ప్రేమించే ఈ మొబైల్ ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయని గ్రహించారా. అవును చాలా పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇంతకీ మొబైల్ ఫోన్లు పక్కన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి ఆరోగ్య నష్టాలు వస్తాయో తెలుసుకుందాం
మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంతగా ఫోన్‌ను దూరంగా ఉంచాలి. అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు.
ఇవేకాదు.. ముఖ్యంగా తల పక్కన ఫోన్ పెట్టుకుని నిద్రించడం వల్ల రాత్రంతా దాని నుంచి రేడియేషన్ విడుదలవుతూ ఉంటుంది. ఆ రేడియేషన్‌లోనే మనం రాత్రంతా గడపడం వల్ల తల నొప్పులు, కండరాల నొప్పుల్లాంటివే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తడానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అలాగే.. ఈ రేడియేషన్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా పేర్కొంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com