Baking Soda vs Baking Powder : బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కు తేడా ఎంటీ?

‘బేకింగ్ సోడా.. బేకింగ్ పౌడర్’.. వంటిళ్లలో కనిపించే పదార్థాలివి. ఈ రెండూ ఒకటేనా? ఒక దాని బదులుగా మరొకటి వాడితే ఏమవుతుంది? చాలా మందికి ఎదురయ్యే అనుమానమిది. అందుకే ఈ రెండింటి గురించి తెలుసుకుందాం.
బేకింగ్ సోడా
దీనిని శాస్త్ర పరిభాషలో సోడియం బైకార్బనైట్ అంటారు. దీనిని నిమ్మరసం, పుల్ల మజ్జిగలాంటి వాటిలో కలిపి వాడినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే కేక్‌లు, మఫిన్‌లు, బిస్కట్ల తయారీలో దీనిని వాడతారు.
బేకింగ్ పౌడర్
ఇది కూడా సోడియం బైకార్బనైటే! అయితే దీనిలో పదార్థాలు వ్యాకోచించటానికి అవసరమైన యాసిడ్ కూడా ఉంటుంది. మొక్కజొన్న పిండి కూడా కొద్దిగా ఉంటుంది. బేకింగ్ సోడాతో పాటుగా నిమ్మరసం లేదా పుల్ల మజ్జిగలాంటివి వాడాలి. బేకింగ్ పౌడర్ వాడినప్పుడు ఇవేమి అవసరం లేదు.
ఏది వాడాలి?
రెండింటినీ వాడవచ్చు. కానీ ఒక గ్రాము బేకింగ్ సోడా బదులుగా మూడు గ్రాముల బేకింగ్ పౌడర్‌ను వాడాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com