Before and After Meals : భోజనానికి ముందు లేదా తర్వాత కాఫీ తాగుతున్నారా?

మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.
డిన్నర్ చేసిన తర్వాత కాఫీ తాగటం పాశ్చాత్యుల పద్ధతి. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా డిన్నర్ తర్వాత కాఫీ లేదా టీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా తాగటం వల్ల అనారోగ్యం కలుగుతుందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
దేశంలో చాలా మంది తరచూ టీ, కాఫీలు తాగడానికి అలవాటు పడ్డారని ఐసీఎంఆర్ గుర్తించింది. అయితే వీటిని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం చాలా ప్రమాదం అని తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుందని.. ఈ కెఫిన్ మనిషి మెదడులోని కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ సమయంలోనే టీ, కాఫీలను పూర్తిగా మానేయాలని మాత్రం చెప్పలేదు. కానీ వాటిలో ఉండే కెఫిన్ కంటెంట్ నుంచి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం– కాఫీ లేదా టీలో ఉండే కెఫైన్ మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. 150 మిల్లీలీటర్ల కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. 150 మిల్లీలీటర్ల ఇన్‌స్టెంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. 150 మిల్లీలీటర్ల టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం– ప్రతి రోజు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి 300 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకోవచ్చు. అంత కన్నా ఎక్కువ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com