మట్టి కుండలో నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు!

ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఇంటి ఇంటికి ఓ కుండ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటికొక ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్ కొనుగోలు చేసే స్తోమత లేని వారు మాత్రం ఇప్పటికీ మట్టి కుండలో నీరే తాగుతున్నారు. మరికొందరు ఫ్రిజ్ ఉన్నా కుండలో వాటర్ ఆరోగ్యానికి మంచిదని మట్టి కుండలోని నీరు తాగుతుంటారు.
మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
మంటి కుండలో నీళ్లలోసహాజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. బాడీ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కుండలో నీరు తాగితే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వాళ్లు కుండ నీళ్లు తాగడం వల్ల.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com