Best Food : బెస్ట్ ఫుడ్.. రాగులు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా!

Best Food : బెస్ట్ ఫుడ్..   రాగులు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా!
X

రాగుల ప్రాధాన్యం పెరుగుతోంది. రాగి సంగటి, రాగి జావ... మొదలైన రాగి వంటకాల జోరు ఊపందుకుంది. అయినప్పటికీ కొన్ని ఇళ్లలో రాగులకు స్థానం ఉండదు. నిజానికి రాగుల్లోని పోషకాల గురించిన అవగాహన ఉంటే, ప్రతి ఇంట్లో రాగుల వంటకాలు ఘుమఘుమలాడతాయి.

ఎముకలు దృఢంగా: ఎముకలు బలంగా ఉండాలంటే సరిపడా క్యాల్షియం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా క్యాల్షియం కోసం పాల ఉత్పత్తుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ రాగుల్లో క్యాల్షియం మోతాదు పాలలో కంటే ఎక్కువ. వ్యక్తి వయసును బట్టి రోజుకు 200 నుంచి 300 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

కాబట్టి రోజువారీ క్యాల్షియం దక్కాలంటే రాగులను ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఆ బరువు తగ్గుతాం: అధిక బరువును వదలించుకోవాలనుకుంటే ఆహారంలో రాగులుఉండాలి. రాగులు, సజ్జలతో మన శరీరంలోకి చేరుకునే క్యాలరీల సంఖ్య తగ్గడంతో పాటు, మెటబాలిజం వేగం పెరుగుతుంది. వీటిలోని పీచు ఆకలిని నెమ్మదించేలా చేస్తుంది. కాబట్టి చిరుతిళ్ల మీదకు మనసు పోదు. ఇలా మొత్తంగా బరువు తగ్గాలనుకునేవాళ్లకు రాగులు మెరుగైన ప్రత్యామ్నాయం.

* చక్కెర అదుపులో: రాగుల్లో పోలీఫెనాల్స్ అనే పోషకాలు ఉంటాయి. వృక్షాహారంలో మాత్రమే దొరికే ఈ కాంపౌండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.

* ఒత్తిడి దూరం: రాగిలోని ట్రైటోఫాన్ అమీనో యాసిడ్, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తొలగించడానికి తోడ్పడతాయి. సహజసిద్ధమైన రిలాక్సెంట్ గుణాలు కలిగిన రాగులు తినడం వల్ల కంటి నిండా నిద్ర పడుతుంది. నిద్ర కూడా ఒత్తిడిని దూరం చేసే సాధనమే!

Tags

Next Story