Herbal Drinks : ఈ హెర్బల్ డ్రింక్స్ తాగండి.. ఎండల్లో తక్షణ శక్తి పొందండి

Herbal Drinks : ఈ హెర్బల్ డ్రింక్స్ తాగండి.. ఎండల్లో తక్షణ శక్తి పొందండి

మండే ఎండల్లో బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లెమన్ జ్యూస్ అనేది శరీరానికి సత్వర శక్తి లభించేలా చేస్తుంది. దేహాన్ని ఆల్క లైజ్ చేయడం నిమ్మ రసం ప్రత్యేకత. దీనిలో “విటమిన్ సీ” ఉంటుంది.

పుదీనా ఆకు అనేక పోషకాల సమ్మేళితం. అజీర్ణం నుంచి తొందరగా ఉపశమనం లభించేందుకు పుదీనా తోడ్పడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. శ్వాసలో తాజాదనాన్ని పెంపొందించేందుకు సహకరిస్తుంది. పుదినా ఆకులను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, అందులో ఉప్పు, శొంఠి వేసుకొని తాగితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరినీళ్లలో అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి. కొబ్బరినీళ్లను తాగితే శరీరానికి సత్వర శక్తి లభిస్తుంది.అల్లం, నిమ్మరసం తో కోల్పోయిన లవణాలను తిరిగి పొందొచ్చు. అల్లం ఆయుర్వేద పరంగా జీర్ణ ప్రక్రియకు సహకరిస్తుంది. వేసవికాలంలో వాంతులు, విరోచనాలను తగ్గిస్తుంది.

పుచ్చకాయల్లో 100% నీరే ఉంటుంది. పుచ్చకాయలను ముక్కలుగా తినొచ్చు. రసం చేసుకుని తాగొచ్చు. శరీరం నిస్సత్తువకు గురైనప్పుడు దీనిని తాగితే సత్వరమైన శక్తి లభిస్తుంది. కలబంద లేదా అలోవెరా జ్యూస్ కడుపులో ఉన్న మంటను తగ్గిస్తుంది. గ్రీన్ టీ తాగితే.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి మెదడు పనితీరును మెరుగుపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story