Fruits : ఈ పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు!

వేసవికాలం పండ్లు బయట పెడితే పాడవుతాయని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అరటిపండ్లు, పుచ్చకాయ, యాపిల్స్, మామిడి, లిచీ, రేగు పండ్లు, చెర్రీస్‌ను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దని సూచిస్తున్నారు.
కొన్నిరకాల పండ్లను మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల చాలా వరకు పండ్లు పాడైపోతాయి. అంతేకాకుండా విషపూరితంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవటమే బెటర్. ఫ్రిజ్‌లో పండ్లను ఉంచడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏ పండ్లను ఉంచకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చట్నీలు, తొక్కులను కూడా చాలామంది ఫ్రిజ్‌లో పెడుతూనే ఉంటారు. సూర్యకాంతి పడకుండా తొక్కులను రెండు మూడేళ్ల పాటు నిల్వ చేయవచ్చు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని చల్లటి ఉష్ణోగ్రతలకు తొక్కులు తొందరగా పాడవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com