Vitamin-C : ఈ పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటాయ్

శరీరానికి సి– విటమిన్ ఎంతో అవసరం. కణాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా తెల్లరక్తకణాల సంఖ్యను పెంచి.. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే గుణం సి–విటమిన్‌కు ఉంది. ఇంతకీ ఏయే పండ్లలో సి– విటమిన్ ఎక్కువ దొరుకుతుందో తెల్సుకుందాం.
వంద గ్రాముల నారింజలో 53 మిల్లీ గ్రాముల సి–విటమిన్ ఉంటుంది. గుప్పెడు నల్ల ద్రాక్ష తింటే 181 మి.గ్రా సి–విటమిన్ లభ్యమవుతుంది. అంటే నారింజ పండ్లకంటే మూడు రెట్లు ఎక్కువ.
కివి పండ్లలో మినరల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ. వంద గ్రాముల కివి పండ్లలో 93 మి.గ్రా. విటమిన్– సి దొరుకుతుంది. స్ట్రాబెర్రీస్‌లో అధికంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కనీసం వంద గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే 58 గ్రాముల సి–విటమిన్ శరీరానికి అందుతుంది.
బరువు తగ్గటానికి, జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే బొప్పాయి పండ్లను ఐదారు ముక్కలు తింటే చాలు.. అందులో 60 మి.గ్రా. విటమిన్–సి దొరుకుతుంది.
వంద గ్రాముల పైనాపిల్ తింటే 47 మి.గ్రా. సి– విటమిన్ ఉంటుంది. చిన్న జామకాయ తింటే 228 గ్రాముల అత్యధిక విటమిన్–సి అందుతుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com