Sweat Safety Tips : చెమటతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి

ఎండాకాలంలో చాలామందిని చికాకు పెట్టే సమస్య చెమట. ఉదయం 10 గంటల దాటితే చాలు సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఎండలో బయటకు వెళ్లకుండా నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తప్పనిసరైనప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
చెమట చిందినా.. ఎండ కొట్టినా.. పని మాత్రం ఆపలేరు కొందరు. ఇలాంటి వారు ఒంట్లో నీరు శాతం తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కచ్చితంగా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. ఒంట్లో నీరు తగ్గిపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. బాడీ డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం.. వడదెబ్బ తగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
చిన్నపిల్లలు, గర్భిణీలు, షుగర్ పేషెంట్స్, యాభయ్యేళ్లు దాటిన వారి గంటకు ఒకసారి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. చెమట పడుతూ ఇబ్బంది పడితే.. కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు చెమట పోయడం తగ్గుతుందనేది నిపుణుల మాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com