Rice : పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది?

బియ్యం (Rice) నిల్వ ఉంచిన డబ్బాల్లో తేమ లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తేమ వల్ల పురుగులు పడతాయట. అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు వంటి ఘాటైన వాసన ఉన్న పదార్థాలను డబ్బాల్లో వేయాలని సూచిస్తున్నారు. వేపాకు, లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి ఉంచినా ఫలితం ఉంటుందట. బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటివి కూడా సహాయపడతాయని, మార్కెట్‌లో కొన్ని కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
బియ్యానికి పురుగులు పట్టడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బియ్యాన్ని కడిగి, ఉడకబెట్టడం వల్ల అందులోని కీటకాలు, బ్యాక్టీరియా చనిపోతాయని అంటున్నారు. కాబట్టి ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపదని పేర్కొంటున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని తింటే జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయని, కానీ ఈ సమస్యల తీవ్రత తక్కువేనని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com