Boost Immunity : సమ్మర్‌లో అలసిపోయే చిన్నారులకు ఈ పండ్లు తినిపించండి

ఎండల్లో ఉన్నా... ఎండా, వానల వింత వాతావరణంలో ఉన్నా పిల్లలకు ఇమ్యూనిటీ కాపాడటం చాలా ముఖ్యం. ఎండ తీవ్రత కారణంగా విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీళ్లు తాగుతారు. తినాల్సినవి తినరు. అందుకే.. సెలెక్టెడ్ ఫుడ్ ను, ఫ్రూట్స్ ను పిల్లలకు అందించాలి.
బొప్పాయి జీర్ణక్రియకు చాలా మంచిది. నీరసంతో ఇబ్బంది పడే వారికి ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది. వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లను చిన్నారులు ఎంత ఇష్టంగా తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్ సి, ఎలు చర్మం.. కళ్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండే కర్భూజ కూడా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. స్ట్రాబెర్రీ ద్వారా పోషకాహారం ఎక్కువగా లభిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయను తనిపిస్తే నీళ్లతోపాటు.. పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సిలు ఆరోగ్యానికి పుష్కలంగా అందుతాయి. ఆటల్లో పడి అలసిపోయే పిల్లలకు ఈ ఫుడ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com