Heatwave Tips : వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి.
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండె లయ తప్పుతుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40 శాతం మేరకు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపుతప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురౌతారు. కళ్లు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారికి త్వరగా వడదెబ్బ తగులుతుంది.
సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలి. శీతల పానీయాలు, చల్లగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి. వడ దెబ్బకు గురైన వ్యక్తులకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలి. జ్యూస్ కేంద్రాలను, ఐస్ క్రీమ్ నాణ్యతలు లేకుండా మార్కెట్లో ఉంటున్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుకొని తాగాలి. కాటన్ వస్త్రాలు ధరించాలి. ప్రజలు బయటికి వెళ్తున్నప్పుడు తలకు ఎండ తగలకుండా గొడుగు, టోపి, కండువాతో తలను కప్పుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com