Face Tips : ముఖం కాంతివంతంగా .. వంటింటి ఫేస్‌ప్యాక్స్

వంటింట్లో వాడే ఆహార పదార్థాలతోనే అద్భుతమైన ఫేస్‌మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. అవే ఇవి..
* బొప్పాయి పండు అంటే ఎవరికైనా ఇష్టమే. అయితే తీపి బొప్పాయితో చక్కని ఫేస్‌మాస్క్ చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల గుజ్జును ముఖానికి మర్దనలా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో మృతకణాలు తొలగిపోతాయి.
* గుమ్మడికాయల గుజ్జుతో ఫేస్‌ప్యాక్ వేసుకుని కరిగిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ ఆపిల్ సిడార్, టీస్పూన్ తేనెను సమపాళ్లలో కలపాలి. బౌల్‌లో బాగా కలిపిన తర్వాత మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. యాంటీబయాటిక్ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
* కీరాదోసకాయను మిశ్రమంగా చేసి.. మాస్క్ వేసుకుంటే పొడిగా ఉండే చర్మం స్మూత్‌గా తయారవుతుంది.
* బౌల్‌లో టీస్పూన్ అవకాడో చూర్ణం, అదే సమపాళ్లలో అరటిపండు గుజ్జు తీసకోవాలి. బాగా మిక్స్‌చేశాక పట్టించాలి. మాస్క్ ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంలో మెరుపుదనం వస్తుంది.
* టేబుల్ స్పూన్ టమోటో గుజ్జు, టేబుల్ స్పూన్ పెరుగు, టీస్పూన్ తేనెను తగుపాళ్లలో తీసుకుని చూర్ణంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచుగా ముఖానికి పట్టిస్తుంటే చర్మంలో ఉండే నూనెశాతం తగ్గిపోవటమే కాకుండా చర్మంలో స్పార్క్ కనపడుతుంది.
* టేబుల్ స్పూన్ ఆరెంజ్ రసం, టేబుల్ స్పూన్ పాలను తగిన నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత కడిగేస్తే ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీంతో పాటు సన్‌టాన్ ఉండదు.
* టీస్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ ఎగ్‌వైట్ మిశ్రమం కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com