Phone : పిల్లకు ఫోన్ ఇవ్వొద్దు.. కొన్నేళ్ల తర్వాత బాధపడొద్దు

సెల్ ఫోన్ తో ప్రయోజనాలే చాలా దుష్పరిణామాలు కూడా కలుగుతున్నాయి. మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి ఫోన్ లోనే కాలం గడుపుతున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు అల్లరి చెయ్యకుండా వాళ్ళ చేతిలో తల్లిదండ్రులు సెల్ ఫోన్ పెడుతున్నారు. దీనితో చాలా మంది పిల్లలు ఫోన్ కు బానిసలైపోతున్నారు.
పొద్దటి నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్ వాడే పిల్లలు మానసిక వ్యాధులకు గురవుతారని పరిశోధనల్లో తేలిందని నిపుణలు పేర్కొంటున్నారు. సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్ కి బానిసలు అయిన పిల్లలకు 23 ఏళ్ళు వయసు వచ్చేసరికి భ్రమ కలగడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని కెనడా పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా టీనేజ్ లో వీడియో గేమ్స్ కి, మొబైల్ కి బానిసలు అయితే ఈ వ్యాధులు వచ్చే అవకాశం 3-7% ఎక్కువగా ఉన్నటుందని వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ ల వినియోగం తగ్గించకపోతే తలిదండ్రులకు పిల్లలకు మధ్య బంధం కూడా దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మానసిక వైద్యుల సలహాలు, సూచనలు పాటించి పిల్లలను ఫిజికల్ ఆటలవైపు ప్రోత్సహించడం చాలామంచిదంటున్నారు నిపుణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com