Weight Loss Tips : బరువును తగ్గించే జామ.. రుచితో పాటు ఆరోగ్యం

జామ పండు రుచి అందరికీ ఇష్టమే. తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో జామ ఒకటి. బరువు తగ్గడం నుండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం వరకు, జామ పండు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఈ పండు ఆకులను తీసుకోవడం లేదా ఈ ఆకుల నుండి టీ తయారు చేయడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
* సీజనల్ ఫ్రూట్స్‌లో జామ కతే వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇందులో విటమిన్–సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరవు. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* డయాబెటిస్‌తో బాధపడేవారూ తినొచ్చు. విటమిన్–ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికెంతో మంచిది.
* ఈ పండు తినటం వల్ల సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌కు గురికాకుండా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. ఇందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలురావు.
* జామ ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. టూత్‌పేస్ట్‌లా పని చేస్తాయి. ఎలాగంటే జామాకులు నమిలితే నోటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీనివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.
* కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
* జామ పండు తింటే శక్తి వస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు తక్కువ.
* జామలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో జామపండు ఉండాల్సిందే.
* నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. జుట్టు పెరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com