Raisin Water Benefits : కిస్మిస్‌ నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

Raisin Water Benefits : కిస్మిస్‌ నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
X

కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతారు. మరికొందరు మెంతులు నానపెట్టిన నీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో కిస్‌మిస్‌లను నానపెట్టి వాటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఒక పది కిస్‌మిస్‌లను తీసుకోవాలి. వాటిని ఒక గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ నీళ్లను ఉదయాన్నే లేచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా తాగాలి.

ప్రయోజనాలేమిటి?

* ఈ నీళ్లలో ఫైబర్‌ ఉంటుంది. దీని వల్ల అజీర్తి తొలగిపోతుంది.

* దీనిలో ఉండే ఐరన్‌, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కణాలకు ఎంతో ఉపకరిస్తాయి.

* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణ జరుగుతుంది. హృద్రోగ సమస్యలు తొలగిపోతాయి.

* ఈ నీళ్లలో ఉండే యాంటీ రాడికల్స్‌ వల్ల కణాలు ఆరోగ్యంగా తయారవుతాయి

* కిస్‌మిస్‌లలో సహజసిద్ధమైన సుగర్‌ ఉంటుంది. కార్బోహైడ్రేడ్స్‌ కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణమే శక్తి కలుగుతుంది.

* ఉదయాన్నే ఈ నీళ్లు తాగటం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వల్ల తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. బరువు తగ్గటానికి వీలవుతుంది.

Tags

Next Story