Fat Loss Tips : హెల్త్ టిప్స్.. ఇవి తింటే కొవ్వు తగ్గుతుంది!

సీజనల్ ఫ్రూట్స్‌లో ద్రాక్ష కథే వేరు. ఈ తీపి ద్రాక్ష కేలరీల గని. అధికంగా న్యూట్రిన్లు ఉంటాయి. కప్పు ద్రాక్షలో 151 గ్రాముల న్యూట్రిన్లు ఉంటాయి. శక్తితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ద్రాక్ష ఉపయోగాలంటే తెలుసుకుందాం..
* ద్రాక్ష తినటం వల్ల ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ ఉందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
* కొవ్వుశాతాన్ని తగ్గించటంలో ద్రాక్ష పాత్ర అధికం. ఒక అధ్యయనం కోసం 69 మందిని ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ ఆహారంతో పాటు అరకేజీ ద్రాక్షను తినిపించారు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయాయి. అందుకే ద్రాక్ష డైట్‌లో ఉంటే బరువు తగ్గవచ్చు.
* ఈ పండ్లు తినటం వల్ల మూడ్ స్వింగ్స్ ఉండవు. చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ద్రాక్ష,
* పొటాషియం, మాంగనీసు, విటమిన్–కె ఉండటం వల్ల ఎముకల ధృడత్వానికి కూడా మంచిది.
* ఈ తియ్యని ద్రాక్ష తినటం వల్ల శరీరానికే కాదు జుట్టుకు మంచి చేకూరుతుంది. చర్మం మీద ఉండే మంటలు, వాతలు లాంటివి తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. దీంతో పాటు జుట్టు పెరుగుదల ఉంటుంది.
* ద్రాక్ష తినకపోతే పిల్లలకు జ్యూస్ చేసి ఇవ్వొచ్చు. లేదా సలాడ్స్ చేసి తినిపించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com