High Heels : హై హీల్స్‌ వేసుకుంటున్నారా.. అయితే జర భద్రం!

High Heels : హై హీల్స్‌ వేసుకుంటున్నారా..  అయితే  జర భద్రం!
X

ఎత్తు చెప్పుల్లో ఉండే స్టయిలే వేరు. వేసుకున్న డ్రస్‌ మరింత మోడర్న్‌గా కనిపించాలంటే హైహీల్స్‌ వేసుకోవలసిందే! అయితే వాటి వాడకం పరిమితంగా ఉంటేనే మేలు! లేదంటే పాదాల సమస్యలు భరించక తప్పదు.

హైహీల్స్‌తో సమస్యలు: ఎత్తు చెప్పులు వేసుకున్నప్పుడు పాదాల అడుగున వంపు ఎక్కువవుతుంది. దాంతో అక్కడ ఉండే ‘అఖిలిస్‌ టెండాన్స్‌’ ఒత్తిడికి లోనై కుంచించుకుపోతాయి. అంతేకాదు... రెండు అంగుళాల ఎత్తు ఉండే హైహీల్స్‌ వేసుకున్నా, నిలబడినప్పుడు శరీరం ముందుకు వంగిపోతుంది. దాంతో పాదం మొత్తం సమాంతరంగా కాకుండా, ముందరి భాగం, బొటనవేలి మీద శరీర బరువు పడుతుంది.

జాగ్రతలు ఇవే!: హైహీల్స్‌ ఎంత తక్కువగా వాడితే అంత మేలు! ఒకవేళ వేసుకోవలసి వచ్చినా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి ప్రభావం తగ్గుతుంది. అవేంటంటే....

● కొనేటప్పుడే పాదం ముందరి ప్రదేశంలో మెత్తగా ఉండేలా చూసుకోవాలి.

● హీల్‌ 2 అంగుళాలు అంతకంటే తక్కువ ఎత్తు ఉండేలా చూసుకోవాలి.

● స్లయిట్‌ హీల్‌ లేదా వెడ్జెస్‌ రకం చెప్పులు పాదం అడుగున వంపుకు సపోర్ట్‌ ఇస్తాయి. కాబట్టి ఈ రకం హైహీల్స్‌ మేలు.

● ముందరి భాగం షార్ప్‌గా ఉండి, మూసుకుపోయి ఉండే హైహీల్స్‌ వద్దు!

Tags

Next Story