Childrens : మీ పిల్లలు మీ మాట వినాలంటే..? ఇలా చేయండి.

Childrens : మీ పిల్లలు మీ మాట వినాలంటే..? ఇలా చేయండి.

తల్లిదండ్రులు ఎంత హుందాగా, క్రమశిక్షణగా పెంచితే పిల్లలు కూడా అంతే సిస్టమేటిక్ గా పెరుగుతారు. అన్నీ నేర్చుకుంటారు. మీ ఇంట్లో మీ మాట తీరు ఎలా ఉంటే వారు కూడా అదే విధంగా మాట్లాడుతారు. పిల్లలకు స్నానాలు, టిఫిన్ లు, ఫుడ్ వంటి ప్రిపరేషన్ లలో, వారికి తినిపించడంలో కచ్చితంగా పిల్లలతోనే ఉంటుంది తల్లి. చాలామంది తండ్రులకు పిల్లలతో ఉండటం లేదనే బెంగ ఉంటుంది. తమ మాట వినడం లేదనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా చేస్తే అంతా సెట్టవుతుందంటున్నారు నిపుణులు.

ఎంత బిజీగా ఉన్నా సరే మీ సమయంలో కాస్త సమయం పిల్లలకు కేటాయించండి. వారానికి ఒక్కసారి అయినా సరే దగ్గరలో ఉన్న పార్కుకు లేదా మరేదైనా స్థలానికి తీసుకోని వెళ్లండి. దీని కోసం దూరం వెళ్లాల్సిన పనిలేదు. దగ్గరలో ఉన్న మాల్స్ పార్కులు వంటి వాటికి తీసుకొని వెళ్లవచ్చు. తీసుకొని వెళ్లి మీరు ఫోన్ లో బిజీ అయ్యి వారిని ఆడుకొండి అని అలా వదిలేయకండి.

పిల్లలతో ఆడుకుంటే, లేదా వాడిని ఆడిస్తుంటేనే వారికి మీకు మంచి రిలేషన్ బాండ్ అవుతుంటుంది. తండ్రి లక్షణాలు పిల్లలకు వచ్చేస్తుంటాయట. అందుకే తండ్రి పాత్ర చాలా సమర్థవంతంగా ఉండాలి. చెడు వ్యసనాలు, అబద్ధాలు చెప్పడం ఉంటే మానుకోవాలి. చీటికి మాటికి ఆవేశం, కోపం ఉంటే కచ్చితంగా మానుకోవాలి. ఈతరం పిల్లలు చాలా యాక్టివ్ ఉంటున్నారు. వారిని భరించాలంటే ఓపిక ఉండాలి. వారు అడిగే ప్రశ్నలకు నిదానంగా సమాధానం చెప్పండి. పిల్లలతో తల్లిదండ్రులు మంచి టైం గడిపితే చాలు.. వాళ్లు ఆటోమేటిక్ గా అన్నీ మంచి అలవాట్లే నేర్చుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story