Headache Tips : తల నొప్పా.. ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో ఔట్ !

Headache Tips : తల నొప్పా.. ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో ఔట్ !

తలనొప్పి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. అయితే తలనొప్పి మొదలవగానే చటుక్కున టాబ్లెట్‌ వేసేసుకోకుండా ఇవిగో ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.

* నీళ్లు తాగండి: ఒంట్లో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి.

* పుచ్చకాయ తినండి: పుచ్చకాయలో ఉండే ఖనిజ లవణాలు చెమట ద్వారా శరీరం కోల్పోయిన లవణాల్ని భర్తీ చేస్తాయి. కాబట్టి పుచ్చకాయ తింటే లవణాల కొరత మూలంగా వచ్చే తలనొప్పి తగ్గుతుంది.

* కాఫీ తాగొచ్చు: కాఫీలోని కెఫీన్‌ న్యూరాన్లను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఒత్తిడి మూలంగా వచ్చే తలనొప్పి విరుగుడుకు ఓ కప్పు కాఫీ తాగండి.

•పెప్పర్‌మింట్‌ ఆయిల్‌: శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా కూడా తలనొప్పి రావొచ్చు. ఈ రకం తలనొప్పి తగ్గాలంటే కణతల దగ్గర పెప్పర్‌మింట్‌ ఆయిల్‌తో మర్దన చేయండి.

* కారంగా తినండి: ముక్కు పక్కల, ఎముకల అడుగున ఉండే గాలి గదుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా తలనొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి తగ్గాలంటే కారంగా ఉండే పదార్థాలు తినాలి. కారం ఘాటుకు ఆ ప్రదేశాలు ప్రేరేపితమై ఇన్‌ఫెక్షన్‌ను కరిగించి ముక్కు ద్వారా బయటకు తెప్పిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story