Cool Water : బాగా చల్లటి నీళ్లు తాగితే మంచిదేనా?

Cool Water : బాగా చల్లటి నీళ్లు తాగితే మంచిదేనా?
X

కొంతమంది ఎప్పుడూ చల్లటి నీళ్లు మాత్రమే తాగుతుంటారు. సీజన్ తో సంబంధం లేకుండా ఫ్రిజ్ లో కూల్ వాటర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు. మరి చల్లటి నీళ్లు శరీరానికి మంచివేనా? అంటే కాదనే అంటున్నారు వైద్యనిపుణులు.

* చల్లటి నీళ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. రోజూ చల్లటి నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఫలితంగా మలబద్ధకం, పొట్టలో నొప్పి, గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఆ నీటి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఆ నీళ్లు శరీరంలోకి చేరినప్పుడు జీర్ణాశయంలో ఉన్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.

* బాగా చల్లటి నీళ్లు తాగడం వల్ల వెన్నులోని సున్నితమైన నరాలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెదడు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

* మెడ నుంచి వెళ్లే వాగన్ నాడీ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. ఒకవేళ బాగా చల్లటి నీళ్ల తాగితే నరాలు వేగంగా చల్లబడతాయి. ఫలితంగా గుండె వేగం, పల్స్ రేటు తగ్గిపోతాయి.

* చల్లటి నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరింత గట్టిగా మారేలా చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరిగించుకోవడం కష్టమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూల్ వాటర్ కు దూరంగా ఉండాలి.

* వర్కవుట్స్ చేసిన తరువాత బిల్డ్ వాటర్ తాగడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా వేసవిలో ఈ ఆలవాటు మంచిది కాదు. వర్కవుట్ చేసినప్పుడు శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. వర్కవుట్ తరువాత వెంటనే చల్లటి నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. కూల్ వాటర్ను శరీరం గ్రహించడం కూడా కష్టమవుతుంది.

Tags

Next Story