Money Plant : మనీ ప్లాంట్ కు ఇదొక్కటి కడితే డబ్బే డబ్బు

Money Plant : మనీ ప్లాంట్ కు ఇదొక్కటి కడితే డబ్బే డబ్బు

మనీ ప్లాంట్ కు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు. ఈ మొక్క శాంతిని చేకూర్చడమే కాదు ఆర్థిక ఇబ్బందులను కూడా దూరం చేస్తుందని నమ్ముతారు.

ఇంట్లో ఉంచే మొక్కలు ఇంటి అందాన్ని పెంచుతుంటాయి. ఈ మొక్కలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయి. మనీ ప్లాంట్ ను సరైన ప్రాంతంలో ఉంచితేనే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఇందులో ఓ వస్తువును వేస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండటం కాదు రెట్టింపు అవుతుందట.

మనీ ప్లాంట్ ను నేల మీద ఎప్పుడు కూడా నాటకూడదు. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కడితే మరింత శుభకరమని చెబుతున్నారు పండితులు. ఎరుపు రంగు విజయం, పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిమితులు తొలిగి పురోగతిని సాధిస్తారని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story