Healthy Food : తోలులోనూ పోషకాలు... అవి ఏవంటే...

X
By - Manikanta |26 April 2024 11:45 AM IST
కొన్ని కూరగాయలు, పండ్లను తొక్కు తీయకుండానే తినాలి. తొక్కులో ఉండే పోషకాలను నష్టపోకుండా ఉండడం కోసం వాటిని తొక్కుతో సహా తినడం అలవాటు చేసుకోవాలి. ఇంతకూ ఆ పండ్లు, కూరగాయలు ఏవంటే...
జుకిని:
సలాడ్ కోసం ఉపయోగించే జుకిని తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పచ్చిగా తినాలనుకున్నా, ఉడికించాలనుకున్నా దీన్ని అలాగే నేరుగా వాడుకోవాలి.
పియర్స్, యాపిల్స్:
ఈ పండ్ల తొక్కల్లో పీచు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి వీటిని కూడా శుభ్రంగా కడిగి, అలాగే తినేయాలి.
క్యారెట్లు, బంగాళాదుంపలు:
వీటి తొక్కులో పొటాషియం, పీచు ఉంటాయి. కాబట్టి వీటిని బాగా శుభ్రం చేసి అలాగే వండుకోవాలి.
కీరా:
కీరాలో తోలులో పీచు, విటమిన్ కె, ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి కీరాను తోలు తీయకుండానే తినాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com