Weight : పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి కారణలు ఎంటీ?

పెళ్లికాకముందే స్లిమ్ గా ఉండే అమ్మాయిలు పెళ్లైన కొన్నాళ్లకే బొద్దుగా తయారవుతుంటారు. అసలు ఎందుకు ఇలా లావు అవుతారు? అన్న డౌట్స్ అందరిలో వస్తుంటాయి. అందుకు గల కారణాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఫంక్షన్స్ ఓ కారణమేనా?
పెళ్లి అంటే దాంతో ముడిపడి ఉన్న పంక్షన్స్ చాలా ఉంటాయి. పెళ్లిచూపులు, ఎంగేజ్ మెంట్, హల్ది, పెళ్లి ఇన్న పంక్షన్లలో రకరకాల పిండివంటలు, జంక్ ఫుడ్ ఆరగించడం వల్ల అమ్మాయిలు లావుగా అవుతారన్న వాదన ఉంది. కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ అబ్బాయిలకు కూడా ఉంటాయన్న డౌట్స్ ఉంటాయి. అయితే అబ్బాయిలు అంతో ఇంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. కానీ అమ్మాయిలకు పెళ్లి సందర్భంగా మీదేసుకొని చేసే పనులేమీ పెద్దగా ఉండవు కాబట్టి.. వాళ్లు బొద్దుగా తయారవుతారన్నది ఓ రీజన్.
అత్తింటివారి ఫుడ్ కల్చర్
పుట్టింట్లో, మెట్టినింట్లో ఫుడ్ కల్చర్ వేర్వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారిగా మనం తీసుకొనే ఆహార పదార్థాలు, ఆహారం తీసుకొనే టైమింగ్ లో తేడాలు ఉండటం వల్ల కూడా అమ్మాయిలు లావు అయిపోవడానికి ఓ కారణమని చెప్పొచ్చు. పెళ్లైన కొత్తలో రాత్రుళ్లు లేట్గా తినడం, అంతేకాదు, తెలిసిన వారు రావడం వారితో కలిసి తినడం, పార్టీస్ ఇలాంటి వాటిని తప్పించుకోలేం. కాబట్టి, కేలరీలు పెరిగి పోషకాలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com