Scarlet Fever : స్కార్లెట్ ఫీవర్.. హైదరాబాద్ లో పిల్లలు జాగ్రత్త

మీ ఇంట్లో చిన్నపిల్లలకు ఫీవర్ వస్తోందా.. ఐతే అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ సహా చిన్నారులను స్కార్లెట్ ఫీవర్ వణికిస్తోంది. ఆసుపత్రులలో స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
భాగ్యనగరంలో ఆందోళనకరంగా స్కార్లెట్ ఫీవర్ వ్యాప్తి కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో చిన్నారులు జ్వరం బారిన పడుతూ ఆసుపత్రులకు చేరుతున్నారు. ఒకపక్క పరీక్షలు ప్రారంభమైన సమయంలో, మరోపక్క చిన్నారులను స్కార్లెట్ ఫీవర్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆసుపత్రులలో జ్వరంతో చికిత్స పొందుతున్న ప్రతి పదిమంది పిల్లలలో ఐదారుగురు పిల్లలు స్కార్లెట్ ఫీవర్ తోనే బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు.
గతంలో కూడా ఈ ఫీవర్ వచ్చినప్పటికీ, ఇటీవల కాలంలో ఈ కేసులు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. అయితే చిన్నారులు జ్వరంతో బాధపడుతూ, స్కార్లెట్ ఫీవర్ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని సూచిస్తున్నారు. సో మీ పిల్లలకు జ్వరం వస్తే జాగ్రత్తగా డాక్టర్ల సలహాతో మందులు వాడండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com