Stay Positive : డిప్రషన్ దరిచేరకూడదంటే ఇలా చేయండి

డిప్రషన్.. ఈ మధ్యకాలంలో మనకు తరచుగా వినిపిస్తున్న మాట. మన దేశంలో మానసిక సమస్యలపై సరైన అవగాహన లేదనేది అందరికీ తెలిసిన విషయమే! అందువల్ల మన దేశంలో డిప్రషన్‌తో బాధపడుతున్నవారి సంఖ్య మనకు కచ్చితంగా తెలియదు. తాజాగా అంతర్జాతీయ పత్రిక ‘నేచుర్ మెంటల్ హెల్త్’లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అమెరికాలో ప్రతి ఐదుగురు పెద్దవాళ్లలో ఒకరు డిప్రషన్‌తో బాధపడుతున్నారని తేలింది. వీరు డిప్రషన్‌కు లోనుకావటానికి ఉన్న కారణాలను కూడా అధ్యయనం చెప్పకనే చెప్పింది. అవేమిటో చూద్దాం
నిద్ర: రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోనివారి శరీరాలలో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. దీని వల్ల డిప్రషన్ ఏర్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో క్రమశిక్షణగా నిద్రపోయేవారిలో ఈ సమస్యలుండవు.
సిగరెట్లు: సిగరెట్ల వల్ల తాత్కాలికంగా ఉత్తేజితులవుతారు. ఇలా రోజు సిగరెట్లు తాగేవారిలో ఒక విధమైన మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. ఇది డిప్రషన్‌కు దారితీస్తాయి.
ఇతరులతో కలవకపోవటం: ఇతరులతో కలవకపోవటం వల్ల– తాము ఒంటరి అనే భావన కలుగుతుంది. ఈ భావన ఎక్కువ కాలం కొనసాగితే అది డిప్రషన్‌గా మారుతుంది.
ఆహారం.. వ్యాయామం: ఈ రెండింటి వల్ల మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. శరీరంలో హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. డిప్రషన్ దరిచేరదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com