Heart : గుండె భేషుగ్గా ఉండాలంటే

Heart : గుండె భేషుగ్గా ఉండాలంటే

గుండె భేషుగ్గా ఉండాలంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి. తీసుకునే ఆహారంలోని మొత్తం కేలరీల్లో కొవ్వుల నుంచి 30% కేలరీలకు మించి అందకుండా చూసుకోవాలి. ఇందుకోసం... అవసరమైతే తప్ప నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, పామాయిల్ లాంటి హైడ్రోజెనేటెడ్ కొవ్వులు తినకూడదు. వీటికి బదులుగా కుసుమ నూనె, పొద్దుతిరుగుడు నూనె, సోయా నూనె వాడాలి. కొవ్వులు జోడించి తయారుచేసే కేకులు, తీపి పదార్థాలు మానేయాలి.

వెన్న తీయని పాలు, పెరుగు, జున్ను, చిక్కని పాలతో తయారైన తీపి పదార్థాలు, చాక్లెట్లు మానేయాలి. కేవలం వెన్న తీసిన పాలతో తయారైన పదార్థాలు మాత్రమే తినాలి. వేరుశెనగ, జీడిపప్పు తప్ప మిగతా పప్పులన్నీ తినవచ్చు. పొట్టు తీసిన, పాలిష్ పట్టిన పదార్థాలు మానేయాలి.

మైదా, మొక్కజొన్న పిండి, నూడుల్స్, మాకరోని బదులుగా పీచు ఎక్కువగా ఉండే పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, చపాతీలు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. ఆవిరి మీద ఉడికించినవి, తక్కువ నూనెతో వండినవే తినాలి. వేపుకు పూర్తిగా మానేయాలి.

Tags

Read MoreRead Less
Next Story