Dental Health : పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

● పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు వల్ల దంతాలు, దవడల నిర్మాణంలో పొరపాట్లు చోటుచేసుకుంటాయి. కాబట్టి ఆ అలవాటును మాన్పించాలి.
● కొంతమంది పిల్లలకు నాలుకతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కూడా మాన్పించాలి.
● పాల దంతాలు సమయానికి ఊడకపోవడం వల్ల, ఆ ప్రదేశంలో వచ్చే శాశ్వత దంతాలు వంకరగా పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పాల దంతాలు సరైన సమయంలో ఊడిపోయేలా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలను దంత వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.
● వంకర పళ్లను సరిచేయించుకోకపోతే, భవిష్యత్తులో వాటిలో ప్లేక్ పేరుకుని పుచ్చిపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
ఓరల్ హెల్త్ ఇలా క్షేమం
● పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. యాపిల్ లాంటి పండ్లతో దంతాలు, చిగుళ్లు శుభ్రపడతాయి.
● క్యాల్షియం సప్లిమెంట్లతో దంతాలు దృఢంగా ఉంటాయి.
● తీపి పదార్థాలను తగ్గించాలి. తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకోవాలి.
● శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
● రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి.
● మెత్తని బ్రిసిల్స్ బ్రష్‌నే దంత ధావనానికి ఉపయోగించాలి.
● ప్రతి మూడు నెలలకోసారి టూత్‌బ్రష్‌ను మారుస్తూ ఉండాలి.
● ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుల చేత దంతాల ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com