Childrens Mindset : పిల్లల మైండ్‌సెట్ మార్చాలంటే ఉదయాన్నే ఇలా మాట్లాడాలి

పిల్లలను తీర్చిదిద్దాలంటే ఆ పనిని పేరెంట్స్ మాత్రమే చేయగలరు. పేరెంట్స్ చెప్పిన మాటలకు ఎమోషనల్‌గా కనెక్టవుతారు. పిల్లల మైండ్‌సెట్ మార్చాలంటే ఉదయాన్నే మాట్లాడాలి ఇలా..
* పిల్లలు నిద్రలేచిన వెంటనే వారికి ‘గుడ్ మార్నింగ్’ చెప్పాలి. నవ్వుతో, హగ్‌తో పిల్లలను దగ్గరకు తీసుకుంటే వారిలో పాజిటివ్‌నెస్ పెరుగుతుంది.
•చైల్డ్‌తో ఎక్కువ మాటలు కలపడం, ఆడుకోవటం చేయాలి. ఉదయాన పిల్లలతో తక్కువ సమయం గడిపినా అది క్వాలిటీ టైమ్ అవుతుంది. దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
* స్కూల్‌లో చదివే పిల్లలతో అయితే మీ ఆలోచనలను, కలల్ని షేర్ చేయండి. వారితో కమ్యూనికేట్ అవటం వల్ల తెలీకుండా చురుగ్గా ఉంటారు.
* వారి స్నేహితుల గురించి అడగటం.. వారి సమాధానాలను, ఆలోచనలు వినటం చేయాలి. దీనివల్ల గ్రేట్‌గా ఫీలవుతారు. ప్రతి రోజూ కాకున్నా కనీసం వారానికి ఓసారి అయినా పిల్లలతో ఉదయం పూట గడిపితే చాలు.. చక్కని ఫలితం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com