Makeup : మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Makeup : మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండాలంటే ఇలా చేయండి!

చిరచిరలాడే ఎండలోకి అడుగు పెడితే, మేకప్‌ మొత్తం చెల్లాచెదరవుతోందా? ఎండకూ, వేడికీ కరిగిపోకుండా, రోజంతా మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండాలంటే, కొన్ని చిట్కాలు పాటించాలి.

* మాయిశ్చరైజర్‌: పగటివేళ ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజర్‌ మాత్రమే ఉపయోగించాలి. ముఖం జిడ్డుగా మారకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.

* సన్‌ ప్రొటెక్షన్‌: మేకప్‌తో పని లేకుండా వేసవి కాలమంతా 30 కంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ వాడుకోవాలి. మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్‌, ఆ తర్వాత ఫౌండేషన్‌ సరైన ఛాయిస్‌.

* ప్రైమర్‌: మేకప్‌ వన్నె తగ్గకుండా ఉండాలంటే ప్రైమర్‌ కూడా తప్పనిసరిగా వాడాలి. ముడతలను కనపడనివ్వకుండా చేసే ప్రైమర్‌తో యంగర్‌ లుక్‌ వస్తుంది.

* తక్కువ మేకప్‌: ముఖం మీద మేకప్‌ ముద్దలు కట్టకుండా, గీతలు పడకుండా ఉండాలంటే, వేసవి కాలంలో వీలైనంత తక్కువ మేకప్‌ వేసుకోవాలి. తప్పనిసరి అయితే టింటెడ్‌ మాయిశ్చరైజర్‌, కన్‌సీలర్లను ఉపయోగించుకోవచ్చు.

* బ్రాంజర్‌: కళ్లు ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రాంజర్‌ వాడుకోవాలి. తాజాగా, సహజసిద్ధ సౌందర్యంతో మెరిసిపోవాలంటే ఎండ సోకే వీలున్న నుదురు, చీక్‌ బోన్స్‌, చుబుకం, ముక్కు మీద బ్రాంజర్‌ అప్లై చేయాలి. వేసవిలో పౌడర్‌ రూపంలోని బ్రాంజర్లనే ఎంచుకోవాలి.

* షిమ్మర్‌ వద్దు: అవసరానికి మించిన మెరుపులు వేసవిలో ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో షిమ్మర్‌ను వాడకపోవడమే మంచిది.

* బ్లష్‌: ఈ కాలంలో పౌడర్‌ బ్లష్‌లకు బదులుగా జెల్‌ బ్లష్‌ వాడుకోవాలి.

* లిప్‌స్టిక్‌: ముదురు రంగు లిప్‌స్టిక్‌లకు బదులుగా హాయిగొలిపే లేత గులాబీ, లేత నారింజ రంగులను ఎంచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story