దేశంలో కరోనా విజృంభణ.. కొవిడ్ గుప్పిట్లో మహారాష్ట్ర

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న 22వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇవాళ భారీగా పెరిగాయి. కొద్దిరోజులుగా మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 23వేల 285 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్రం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటీ 13 లక్షలు దాటింది. రో 117 మంది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య లక్షా 58 వేల 306కు పెరిగింది.
కొవిడ్ గుప్పిట్లో మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రపత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
అటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలులోకి తెచ్చిన ప్రభుత్వం.. మరో రెండు జిల్లాల్లో శుక్రవారం నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. పాటియాలా, లూథియానా నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుండగా.. ప్రభుత్వ అత్యవసర సేవలతో పాటు ప్రభుత్వ అధికారులు, వైద్యసేవలు, విధుల్లో ఉన్న పోలీసులు, ఆర్మీ సిబ్బందికి ఉత్తర్వుల నుంచి మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆరు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది.
ఇటు తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరగుతున్నాయి. నిన్న ఒక రోజే 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 44 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో నిన్న ఒకరు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com