దేశంలో కరోనా విలయతాండవం: పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గి.. మరణాల సంఖ్య పెరిగి

దేశంలో కరోనా విలయతాండవం: పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గి.. మరణాల సంఖ్య పెరిగి
ఈ క్రమంలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుందన్న వార్త సంతోషకరం.

భారత్ లో కరోనా సృష్టించే కల్లోలం అంతా ఇంతా కాదు. ఫోన్ రింగవుతుంటే ఎవరి దగ్గర నుంచి ఏం వార్త వినాల్సి వస్తుందో అన్న భయం. ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న ఆందోళన జనం బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.

నిత్యావసరాల కొనుగోలుకు ఇచ్చిన సమయంలో భయపడుతూనే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుందన్న వార్త సంతోషకరం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,11,170 కొత్త కేసులు నమోదు కాగా, కోవిడ్ తో పోరాడుతూ ప్రాణాలు పోయిన వారి సంఖ్య 4,077గా నమోదైంది.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077. ఇక మరణించిన వారి సంఖ్య చూస్తే 2,70,284గా ఉంది.

అయితే నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. నిన్న ఒక్కరోజే 3,62,437 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2,07,95,335కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 36,18,458 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇక వ్యాక్సిన్ కార్యక్రమం కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 18,22,30,164గా ఉంది.

రెండో డోసుకి 3 నుంచి 4 నెలల కాల పరిమితి ఇవ్వడంతో టీకా తీసుకునే వారి సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. మొదటి డోసు వ్యాక్సిన్ కోసం జనం క్యూలు కడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి పాజిటివ్ ఉందో ఏమో అన్న భయం కూడా ప్రజల ముఖాల్లో ప్రస్పుటంగా కనిపిస్తోంది.

Tags

Next Story