భారత్ కరోనా కలకలం.. కొత్తగా 76,472 కేసులు

భారత్ కరోనా కలకలం.. కొత్తగా 76,472 కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులకు ప్రభుత్వవర్గాల్లో ఆందోళన మొదలైంది

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులకు ప్రభుత్వవర్గాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 76,472 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 34,63,973కి చేరింది. అటు, కరోనా మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 1,021 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 62,550కు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 26,48,999 మంది కోలుకోగా.. ఇంకా 7,52,424 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story