భారత్‌లో కొత్తగా 70,589 కరోనా కేసులు

భారత్‌లో కొత్తగా 70,589 కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,589 కరోనా సోకిందని తెలిపింది.

కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,589 కరోనా సోకిందని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. అటు, తాజాగా 776 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ 51,01,397 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,47,576 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 96,318 మంది కరోనా కాటుకి బలైయ్యారు. దేశంలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. రోజు వారీ కరోనా కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది.

Tags

Next Story