Corona Update:కరోనా కనికరిస్తోంది.. తగ్గుముఖం పడుతున్న కేసుల సంఖ్య

Corona Update:కరోనా కనికరిస్తోంది.. తగ్గుముఖం పడుతున్న కేసుల సంఖ్య
X
కరోనా పేరు వింటేనే వణికి పోతున్న ప్రజలు. ఈ నేపథ్యంలో కరోనా గణాంకాలు కొంత ఊరటనిస్తున్నాయి.

Corona Update: దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం ఇంతా అంతా కాదు. లెక్కకు మించిన పాజిటివ్ కేసులు.. ఊహించని మరణాలు.. కరోనా పేరు వింటేనే వణికి పోతున్న ప్రజలు. ఈ నేపథ్యంలో కరోనా గణాంకాలు కొంత ఊరటనిస్తున్నాయి.

ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కేసులు నమోదవుతున్నప్పటికీ మొత్తం మీద చూస్తే కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆదివారం 15,73,515 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 2,81,386 మందికి పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే 4,106 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2.49 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 2,74,390 మంది.

ప్రస్తుతం 35,16,997 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. నమోదవుతున్న కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కూడా అదే స్థాయిలో ఉండడం కాస్త ఊరటినిచ్చే అంశం.

ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే ఆదివారం కేవలం 6,91,211 మందికి అందించారు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 18,29 కోట్లు.

Tags

Next Story