Corona: రికవరీలు పెరుగుతున్నాయి.. కానీ మరణాలు తగ్గట్లేదు..

Corona: రికవరీలు పెరుగుతున్నాయి.. కానీ మరణాలు తగ్గట్లేదు..
X
దేశంలో కరోనా మహమ్మారి కకావికలం సృష్టిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్య నాలుగువేలకు పైగా నమోదైంది.

Corona: దేశంలో కరోనా మహమ్మారి కకావికలం సృష్టిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్య నాలుగువేలకు పైగా నమోదైంది. ఇక వైరస్ బారిన పడిన వారు 2.59 లక్షల మంది అని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది.

గురువారం 20,61,683 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 2,59551 మందికి పాజిటివ్ అని తేలింది. బుధవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్ల 60 లక్షల మార్కును దాటింది.

24 గంటల వ్యవధిలో 4,209 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,91,331 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.

రికవరీల్లో సానుకూల అంశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం 30, 27,925 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దాదాపు 3,57,295 మంది కోలుకున్నారు.

మొత్తంగా 2.27 కోట్ల మందికి పైగా కోలుకోగా రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. మరోవైపు నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నవారు 14,82,754 మందికి వ్యాక్సిన్ అందింది.

Tags

Next Story