Corona Update: అదుపులోకి వస్తున్న కరోనా.. కానీ ఆందోళన కలిగిస్తున్న మరణాలు..

Corona Update: అదుపులోకి వస్తున్న కరోనా.. కానీ ఆందోళన కలిగిస్తున్న మరణాలు..
X
దేశంలో కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. నిన్న 2,22,315 కరోనావైరస్ కేసులను నమోదు చేసింది.

Corona Update: దేశంలో కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. నిన్న 2,22,315 కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఇది 38 రోజులలో అతి తక్కువ, COVID-19 కేసుల సంఖ్య 2,67,52,447 కు చేరుకుంది, మరణాల సంఖ్య 3 లక్షలను దాటింది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా సోమవారం విడుదల చేసింది.

రోజువారీ 4,454 మరణాలతో మరణాల సంఖ్య 3,03,720 కు చేరుకుంది, ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటాలో ఈ సంఖ్యలు పేర్కొన్నారు.

దేశంలో ఏప్రిల్ 16 న 24 గంటల వ్యవధిలో 2,17,353 కొత్త కేసులను నమోదు చేసింది.

జాతీయ COVID-19 రికవరీ రేటు 88.69 శాతానికి మెరుగుపడింది. ఈ వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 2,37,28,011 కు పెరిగింది. కాగా, మరణాల రేటు 1.14 శాతానికి పెరిగిందని డేటా పేర్కొంది.

మరోవైపు టీకాల పంపిణీ కార్యక్రమం నిర్విగ్నంగా కొనసాగుతోంది. నిన్న దాదాపు 9,42,722 మందికి వ్యాక్సిన్ అందింది. మొత్తంగా 19.60 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇక తమిళనాడు విషయానికి వస్తే రాష్ట్రంలో నిన్న అత్యధిక కేసులు అక్కడ వెలుగు చూశాయి. 35,483 మందికి కరోనా సోకింది. అలాగే 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కూడా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో రికార్డైన మరణాల సంఖ్య 1320. తరువాతి స్థానంలో కర్ణాటక. కేరళలో 25వేల కేసులు నమోదయ్యాయి. కేరళలో నిన్న ఒక్క రోజే కోవిడ్ బారిన పడి 188 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story