మళ్లీ కలవర పెడుతున్న కరోనా

దేశంలో కరోనా భయాలు పెరుగుతున్నాయి. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజులోనే ఢిల్లీలో 13వందల 96 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలో నలుగురు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అయితే అందులో ఒకరిది మాత్రమే కోవిడ్ మరణమని.. మిగతా నలుగురి మరణానికి ప్రధాన కారణం వేరే ఉందని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం 4వేల 631 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 2వేల 977 మంది, ఆస్పత్రిలో 258మంది బాధితులు ఉన్నారు. ఇక ఐసీయూలో 93మందికి కొనసాగుతుంది. వీరిలో 66మంది ఆక్సిజన్ సపోర్టుతో ఉండగా.. మరో 12మంది వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది. వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com