Maharashtra : వ్యాక్సిన్ వికటించి కూతురు మృతి.. రూ.1000 కోట్లు పరిహారం కోరిన తండ్రి

Maharashtra : వ్యాక్సిన్ వికటించి కూతురు మృతి.. రూ.1000 కోట్లు పరిహారం కోరిన తండ్రి
Maharashtra : టీకాలు సురక్షితమని ప్రభుత్వం పేర్కొనడంతో తన బిడ్డ వ్యాక్సిన్ వేయించుకుందని తెలిపారు.

Maharastra: వ్యాక్సిన్ ప్రక్రియను ఓ యజ్ఞంలా చేపట్టి దాదాపు దేశం మొత్తం టీకాలు వేయించుకునేలా ప్రోత్సహించింది ప్రభుత్వం. వ్యాక్సిన్ వేయించుకోపోతే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతామనే భయం చేత దాదాపు అందరూ టీకాలు వేయించుకున్నారు.

ఆమె డాక్టర్.. పేషెంట్లకు వ్యాక్సిన్ గురించి వివరించింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ వుండవని తెలిపింది.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించింది. కానీ ఆమె మాత్రం టీకా వేయించుకున్న రెండు నెలలకే ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి దు:ఖాన్ని మిగిల్చింది. డాక్టరై నలుగురికీ సేవలందిస్తున్న తన చిట్టి తల్లి ఇలా టీకాకు బలవడం కన్నతండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. తన బిడ్డ ప్రాణాలు తీసిన వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీపై కేసు వేసి భారీ నష్టపరిహారాన్ని కోరుతున్నాడు..

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా వైద్య విద్యార్థిని అయిన తన కుమార్తె చనిపోయిందని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మరియు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1000 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఔరంగాబాద్ వాసి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ దిలీప్ లునావత్, గత వారం హెచ్‌సి ప్రిన్సిపల్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు, నాసిక్‌లో వైద్య విద్యార్థిని అయిన తన కుమార్తె స్నేహల్‌కు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, శరీరానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదని హామీ ఇచ్చిన మీదట కళాశాలలో వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వచ్చిందని ఆమె తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్), మహారాష్ట్ర ప్రభుత్వం మరియు యూనియన్‌లు రూపొందించిన తప్పుడు కథనాల కారణంగా తన కుమార్తె వంటి ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని లునావత్ పేర్కొన్నారు. టీకాలు సురక్షితమని ప్రభుత్వం పేర్కొనడంతో తన బిడ్డ వ్యాక్సిన్ వేయించుకుందని తెలిపారు.

తన కుమార్తె జనవరి 28, 2021న వ్యాక్సిన్ తీసుకున్నారని, ఆ వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాల కారణంగా కొన్ని వారాల తర్వాత మార్చి 1న చనిపోయిందని ఆయన చెప్పారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్లే తన కూతురు చనిపోయిందని కేంద్ర ప్రభుత్వ AEFI కమిటీ అక్టోబర్ 2, 2021న అంగీకరించిందని లునావత్ వాదించారు.

ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కారణంగా అనేక మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడటానికి ఈ పిటిషన్ దాఖలు చేయబడింది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని గతవారమే దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇంకా విచారణ తేదీని కేటాయించలేదు.

Tags

Read MoreRead Less
Next Story