Corona: గుడ్ న్యూస్.. తగ్గుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య

Corona: గుడ్ న్యూస్.. తగ్గుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య
కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.

Corona:కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. యాక్టివ్ కేసులు లక్షకు పైగా తగ్గాయి. క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 17.93 లక్షలు.

గత 24 గంటల్లో భారతదేశం 1,32,788 కొత్త కరోనావైరస్ కేసులు, 3,207 మరణాలను నమోదు చేసింది. 26,500 కి పైగా కేసులతో, దేశంలోనే ఎక్కువ కేసులను తమిళనాడు నమోదు చేసింది. యాక్టివ్ కేసులు లక్షకు పైగా తగ్గాయి. మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 17.93 లక్షలు.

జిల్లాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ పరిమితులను క్రమంగా ఎత్తివేయాలంటే వారానికి 5 శాతం కంటే తక్కువ పాజిటివ్ రేటు, జనాభాలో 70 శాతం మంది టీకాలు వేయించుకుని ఉండాలి.

భారతదేశంలోని 718 జిల్లాల్లో దాదాపు సగం ఇప్పుడు ఏడు రోజుల పాజిటివిటీని 5 శాతం కంటే తక్కువగా నమోదు చేస్తుంది. 45 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కేవలం 32 శాతం మందికి మాత్రమే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని కోరింది. మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఔ షధ పంపిణీలో చిన్న వయసు వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని పేర్కొంది .

Tags

Read MoreRead Less
Next Story